ఒకవైపు కరోనా, మరో వైపు లాక్ డౌన్స్… ప్రపంచం మొత్తం అంతోఇంతో సంక్షోభంలోనే ఉంది. ఇండియాలో పరిస్థితి తీవ్రంగా ఉంటే అమెరికాలో క్రమంగా తేలికపడుతోంది. అందుకు, తగ్గట్టే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనూ మళ్లీ ఊపు మొదలైంది. గత వారం చెప్పుకోదగ్గ స్థాయిలో వార్తలు హల్ చల్ చేశాయి…
ప్రపంచ ప్రఖ్యాత సింగర్స్ బ్యాండ్… బీటీఎస్ సరికొత్త పాట విడుదల చేసింది. ‘బటర్’ పేరుతో జనం ముందుకొచ్చిన ఈ సాంగ్ ఇప్పుడు బీటీఎస్ అభిమానుల న్యూ యాంథమ్ అయిపోయింది. బీటీఎస్ సింగర్స్ ఎప్పటిలాగే తమ సింగింగ్ తో, డ్యాన్సులతో మెస్మరైజ్ చేశారు!
దేశదేశాల్లో ఎందరో అభిమానులున్న లేడీ గాగా తన జీవితంలోని విషాదకర సంఘటన బయటపెట్టింది. ఓప్రా విన్ ఫ్రేతో ఆమె చేసిన చాట్ షోలో 19వ ఏట తనని ఓ ప్రొడ్యూసర్ రేప్ చేశాడని చెప్పింది. తాను ఒంటి మీది బట్టలన్నీ విప్పేయకుంటే తన మ్యూజిక్ కి సంబంధించిన సీడీల వంటివన్నీ కాల్చేస్తామని బెదిరించారట. దాంతో ఆమె రేప్ కి గురై ప్రెగ్నెంట్ కూడా అయిందట!
హాలీవుడ్ సీక్వెల్స్ లో బాగా పాప్యులారిటీ ఉన్న యాక్షన్ సీరిస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. 9వ ఇన్ స్టాల్మెంట్ తో జనం ముందుకు రాబోతోన్న ఫిల్మ్ మేకర్స్ లెటెస్ట్ గా బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. దుబాయ్ లోని బుర్జ్ ఖిలీఫాపై మూవీ టీజర్ ని ప్లే చేశారు. భారీ భవనంపై యాక్షన్ టీజర్ ప్రసారం కావటంతో చూసిన వారు ఆశ్చర్యపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ కోసం ఎదురు చూస్తున్న వారు మురిసిపోయారు!
‘బ్లాక్ విడో’ ప్రోమోతో స్కార్లెట్ జోహాన్సన్ తన ఫ్యాన్స్ ని స్పెల్ బౌండ్ చేసింది. ఆమెతో పాటూ ప్రోమోలో కనిపించిన ఫ్లోరెన్స్ పగ్ కూడా వావ్ అనిపించింది. ఛేజింగ్స్, స్టంట్స్ పక్కన పెడితే స్కార్లెట్, ఫ్లోరెన్స్ మధ్య నడిచిన ఫ్రెండ్ షిప్ ప్రోమోలో చాలా మందిని ఆకట్టుకుంది. వీరిద్దరూ కలసి నటించిన ‘బ్లాక్ విడో’ త్వరలో విడుదల కావాల్సి ఉంది…
‘ద గ్రే మ్యాన్’ హాలీవుడ్ మూవీలో ధనుష్ నటిస్తోన్న విషయం మనకు తెలిసిందే. అయితే, ఇదే ప్రాజెక్ట్ లో ఇప్పుడు మరో ఇండియాన్ యాక్టర్ భాగంగా కానున్నారు. రయాన్ గోస్లింగ్, క్రిస్ ఇవాన్స్ రూపొందిస్తోన్న ‘ద గ్రే మ్యాన్’లో ఐశ్వర్య సోనార్ ఓ క్యారెక్టర్ చేయనుంది. ఆమె నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ‘వెంటిలేటర్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. అంతే కాదు, ప్రియాంక చోప్రా నిర్మించిన మరాఠీ సినిమా ‘కాయ్ రే రాస్కలా’లోనూ మంచి పాత్రలో ప్రతిభని చాటింది. ‘ద గ్రే మ్యాన్’తో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.