వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశం జరిగింది. అందులో నక్సలిజం 23శాతానికి , మరణాల సంఖ్య 21శాతానికి తగ్గింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాలతో నక్సలిజాన్ని అణిచివేయడంలో సఫలం. దశాబ్దాల పోరాటంలో తొలిసారిగా 200 కంటే తక్కువ మంది మరణించారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలన జరగకపోతే దేశ సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదు. కేంద్రబలగాల కోసం రాష్ట్రాలు భరించే ఖర్చును ప్రధాని తగ్గించారు. ఫలితంగా 2900 కోట్ల రూపాయల ఖర్చు రాష్ట్రాలకు తగ్గిపోయింది అన్నారు.
ఇక ఆయుధాలు అప్పగించి ప్రజాస్వామ్య స్రవంతిలోకి వచ్చే మావోయుస్టులను ఆహ్వానిస్తూనే, అమాయక జనాన్ని, పోలీసులను చంపే వారికి అదే రీతిలో బుద్ధి చెప్తున్నాం. గత ఆరు దశాబ్దాలలో అభివృద్ధి లేమి కారణంగానే వామపక్ష తీవ్రవాదానికి బీజం పడింది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి జరుగుతోంది. సామాన్య ప్రజల అభివృద్ధికి అడ్డుపడకూడదని వామపక్ష తీవ్రవాదులు సైతం భావిస్తున్నారు, అందుకే వేగంగా పనులు జరుగుతున్నాయి. వామపక్ష తీవ్రవాదం వల్ల గత 40 ఏళ్లలో 16వేల మంది పౌరులు చనిపోయారు.
Also Read
ఈశాన్య ప్రాంతాల్లో తిరుగుబాటు బృందాలు సైతం లొంగిపోతున్నాయి అన్నారు. వామపక్ష తీవ్రవాదం నిర్మూలనకు వారి ఆర్థిక వనరులను అడ్డుకోవడం అత్యంత ముఖ్యం. హింసాత్మక ఘటనలు 70శాతం తగ్గిపోయాయి, మృతుల సంఖ్య 82శాతానికి తగ్గింది. ప్రస్తుతం 53 జిల్లాలలోనే మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. వామపక్ష తీవ్రవాదులకు ఆర్థిక వనరులు అందకుండా రాష్ట్రాలు పరస్సర సహకారంతో గట్టి చర్యలు తీసుకోవాలి. త్వరలోనే వామపక్ష తీవ్రవాదానికి చరమగీతం పాడే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?