కోవిడ్ పేషేంట్ ల శవాల విషయంలో జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని కోవిడ్ 19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ అన్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచెయ్యొద్దు. కోవిడ్ పేషెంట్ ల శవాల్ని కృష్ణలంక విద్యుత్ దహన వాటిక లో దహనం చేస్తున్నారు అని చెప్పిన ఆయన మామూలు శవాల్ని కూడా కోవిడ్ శవాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితుల్ని పరిశీలించాం. సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు జరుగుతున్నాయి. శ్మశాన వాటికల్లో కొవిడ్ నియమాల్ని పాటిస్తున్నారు అని పేర్కొన్నారు.