టెస్టింగ్ రిజల్ట్స్ ఏరోజుకారోజు వచ్చేలా తక్షణ చర్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కో విడ్ నియంత్రణ కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఛైర్ పర్సన్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ… టెస్టింగ్ రిజల్ట్స్ ఏరోజుకారోజు వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని తద్వారా పేషెంట్లకు త్వరితగతిన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.రాబోయే 48 గంటల్లో క్షేత్ర స్థాయిలో ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్ లు చేయాలి. అలాగే ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ ద్వారా అన్ని బ్యాక్లాగ్ శాంపిళ్లనూ క్లియర్ చేయాలి. ఏడు రోజులకంటే ఎక్కువ ఉన్న శాంపిళ్లన్నంటినీ archive లో పెట్టి శాంపుల్ ఐడి ఎవరైనా కోరినట్లయితే అప్పుడు టెస్ట్ చేయాలి. కోవిడ్ హాస్పిటల్లో అనేకమంది పేషెంట్లు చిన్నచిన్న సింప్టమ్స్ తో వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారికి ప్రతి పెద్ద హాస్పిటల్ లో Triaging సెంటర్ నెలకొల్పాలి. పేషెంట్ ను ఐడెంటిఫై చేసి అవసరమైనవారికి హోమ్ ఐసోలేషన్ లేదా కోవిడ్ కేర్ సెంటర్ లో అడ్మిట్ చెయ్యాలి. సీరియస్ పేషెంట్లకు కోవిడ్ హాస్పిటల్ లో అడ్మిషన్ వచ్చేటట్లు ప్రయత్నం చేయాలి
అలాగే కొద్దిగా లక్షణాలున్న పేషెంట్లనందరినీ కోవిడ్ కేర్ సెంటర్ కి పంపించి అక్కడ కొన్ని ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉంచాలి. దీంతో మైల్డ్ పేషెంట్స్ కి తగిన వైద్య సదుపాయం అందజేసిన వారమవుతాము ప్రతి జిల్లాలో కనీసం మూడు వేల బెడ్లు కోవిడ్ కేర్ సెంటర్ల ద్వారా సన్నద్ధం చేయాలి. కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ కాన్సెంట్రేట్ లను పెట్టినట్లయితే మైల్డ్ కోవిడ్ పేషెంట్లకు చక్కటి సదుపాయం కలిగించి నట్లవుతుంది. ప్రతి జిల్లా లో 1000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ను కల్పించే ప్రయత్నం చేయాలి. పూర్తిస్థాయిలో ఆక్సిజన్ సప్లై ను వాడుకోవాలి. డిఫెన్స్ వారి సహాయంతో వాయు మార్గం ద్వారా ట్యాంకర్లు పంపి ఆక్సిజన్ ను ఒడిశాలోని అంగూల్ లాంటి ప్రదేశాలనుంచి తెచ్చే ప్రయత్నం చేయాలి. లోకల్ గా ఉన్న ఇండస్ట్రీస్ తో మాట్లాడి ఇండస్ట్రియల్ గ్యాస్ సిలిండర్ ను మెడికల్ గ్యాస్ సిలిండర్ గా మార్చి లోకల్ సప్లై కు అనుగుణంగా వాడుకోవాలి. BHEL మరియు ఇతర సంస్థలతో మాట్లాడి క్రయోజనిక్ Tankers తయారీ విషయంలో వాటి ద్వారా ఆక్సిజన్ సరఫరా విషయంలో తగు చర్యలు త్వరగా తీసుకోవాలి. అలాగే కరోనా మృత దేహాల డిస్పోజల్ విషయంలో పూర్తి ప్రోటోకాల్ తయారుచేసి తగు చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణం టీమ్?
-
Srisailam Dam: శ్రీశైలం వైపు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. వారంలో గేట్లు ఎత్తే అవకాశం.!
-
IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
-
Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
-
Bhogapuram International Airport: భోగాపురం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్.. ఎయిర్‌లైన్స్ షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!