బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరికీ వారు వెరైటీగానే ఉన్నారు. అయితే అందులో యాంకర్ లహరి మాత్రం చాలా పొగరుగా కన్పిస్తూ, హౌస్ లోని వాళ్ళతో గొడవ పడుతూ హైలెట్ అవుతోంది. ఈ లేడీ అర్జున్ రెడ్డి షోకు వెళ్ళకముందు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ బ్యూటీ ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత సినిమాల్లోనూ నటించింది. ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” సినిమాలో కీలకమైన పాత్రను పోషించింది.
Read Also : సామ్, చై మధ్య ఏం లేనట్టేనా ?
ఈ ఇంటర్వ్యూలో ఆమె తాము బ్రాహ్మణులమని, అయినా తాను నాన్ వెజ్ తింటానని, తాగునని చెప్పింది. తన ఫ్యామిలీలో ఉన్న వాళ్లలో అమ్మాయి తానొక్కతే అని, అందుకే తనకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారని, కానీ తానెప్పుడూ ఆ ఫ్రీడమ్ ను దుర్వినియోగపరచుకోలేదని చెప్పుకొచ్చింది. లహరి తన తల్లి డిజైనర్ అని, ఆమె ఎప్పుడూ అలాంటి బట్టలు వేసుకో, ఇలాంటి బట్టలు వేసుకోకు వంటి ఆంక్షలు పెట్టలేదని చెప్పుకొచ్చింది. తనపై తనకు కాన్ఫిడెన్స్ ఎక్కువని, తన బలం తన ఫ్యామిలీ అంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆమె ఇంకా ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందో ఈ వీడియోలో వీక్షించండి.