తాలిబన్లు ఎంతటి కర్కశకులో చెప్పనలివి కాదు. మానవత్వం మచ్చుకైనా కనిపించదు. జాలి, దయ అన్నవి వారి నిఘంటువులో కనిపించవు. తెలిసందల్లా రక్తపాతం సృష్టించడం, ప్రజలకు భయపెట్టడం. బయటిప్రజలతోనే కాదు, ఇంట్లోని భార్య, బిడ్డలతో కూడా వారి ప్రవర్తన అలానే ఉంటుంది. దీనికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాలుగేళ్ల క్రితం చిన్న బిడ్డలను తీసుకొని పొట్ట చేత్తోపట్టుకొని ఇండియా వచ్చింది ఫరిభా అనే మహిళ. ఆఫ్ఘన్లో ఆమె ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నదో తెలిస్తే నోటిమాటలు రావు. తాలిబన్లు మరీ అంతటి రాక్షసుల్లా ప్రవర్తిస్తారా అనే అనుమానం వస్తుంది. భయం కలుగుతుంది. ఫరీభా పేదకుటుంబంలో పుట్టిన మహిళ. పేదరికం కారణంగా 14 ఏళ్ల వయసులో తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.
Read: ఆఫ్ఘన్‌లోని భారత రాయబార కార్యాలయాలపై తాలిబన్ దాడులు… పత్రాలు స్వాధీనం…
అత్తగారింట్లోకి అడుగుపెట్టిన తరువాత ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. భర్త తాలిబన్. కౄరత్వంగా వ్యవహరించేవాడు. భర్త గురించిన విషయాలు తెలుసుకునే సరికి ఆమెకు నలుగురు ఆడపిల్లలు పుట్టారు. పెద్దమ్మాయిని తాలిబన్ డబ్బుకోసం అమ్మేశాడు. చెప్పినా వినిపించుకోలేదు. రెండో అమ్మాయిని కూడా అలానే అమ్మాలని ప్రయత్నించగా, చిన్నారి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లి చూసిప్తానని చెప్పిన ఆ తాలిబన్ భర్త ఆ చిన్నారిని ఏం చేశాడో ఎవరికీ చెప్పలేదు. ఆ భయంతో తాను ఇంటిని వదిలి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇండియా వచ్చేసినట్టు ఫరిభా పేర్కొన్నది. ఢిల్లీలో జిమ్ ట్రైనర్‌గా ఉపాది పొందుతోంది. పిల్లల్ని పెద్దచదువులు చదివిస్తానని చెబుతున్నది ఫరీభా. తనలాగే ఆఫ్ఘనిస్తాన్‌లో వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నది.