యంగ్ బ్యూటీ రష్మిక మందన్న సౌత్ బిజీ హీరోయిన్లలో ఒకరు. స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో కలిపి 4 అద్భుతమైన ప్రాజెక్ట్‌లలో పని చేస్తోంది. దసరా పండుగ సందర్భంగా రష్మిక హీరోయిన్ గా నటించిన తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌కు అభిమానుల నుండి మంచి స్పందన లభించగా, ట్విట్టర్‌లో కొంతమంది మాత్రం ట్రోలింగ్ చేశారు. అందులో ఓ నెటిజన్ రష్మికను టార్గెట్ చేస్తూ కామెంట్ చేశాడు. “ఎలా తీసుకున్నారురా దీన్ని ?” అంటూ రష్మిక ఫోటోను, నిర్మాణ సంస్థను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించాడు.
Read Also : కీర్తి సురేశ్ ఇంటిపేరు ‘మహానటి’!
అయితే ఈ ట్రోల్ పై రష్మిక స్పందించిన తీరు ఆమె అభిమానులను ఫిదా చేసింది. ఆమె వాళ్ళతో వాదించాలనుకోలేదు. అలాగే కోప్పడలేదు చాలా కూల్ గా “నా యాక్టింగ్ కోసం ” అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇంకేముంది నెటిజన్ మళ్ళీ తిరిగి స్పందించలేదు. రష్మిక స్పోర్టివ్, కాన్ఫిడెంట్ రిప్లై తో అభిమానుల హృదయాలను గెలుచుకుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందంగా ఉన్నా, లేకపోయినా అందరూ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు కదా.
Naa acting kosam. 😅🤣
— Rashmika Mandanna (@iamRashmika) October 15, 2021