ఏపీ, తెలంగాణాలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది..రానున్న మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి..ఇక తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది..
Read Also:Vijay Sethupathi:ఇన్స్టాగ్రామ్ లో విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న ఏడుగురు ఎవరంటే?
రాష్ట్రంలో ముఖ్యంగా కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచనలున్నాయని చెప్పింది. ఆదివారం, రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. శనివారం రాత్రి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి… ఇక ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..
Read Also:Samyukta Menon : శారీలో స్కిన్ షో చేస్తూ స్టన్నింగ్ పోజులు..
ఏపీలో సైతం వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కోస్తాంధ్రకు విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు.అటు రాయలసీమ జిల్లాలోను మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.. ప్రజలు మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..