Sai Dharam Tej: జీవితం చాలా చిన్నది. ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో చెప్పడం చాలా కష్టం. ఆ ప్రమాదాల నుంచి బయటపడినవారికే జీవితం అంటే ఏంటో ఇంకా బాగా తెలుస్తుంది. అటువంటి ప్రమాదం నుంచి బయటపడిన హీరో సాయి ధరమ్ తేజ్.
ప్రముఖ నటుడు, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసింది. సరిగ్గా అదే సమయంలో అతను నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం విడుదలైంది. అయితే చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరిన సాయిధరమ్ తేజ్ ఈ మూవీ ప్రమోషన్స్ లో సైతం పాల్గొనలేదు. చావు అంచువరకూ వెళ్లి తిరిగొచ్చిన సాయితేజ్ తను ఆరోగ్యం గురించి ఆరా తీసిన వాళ్ళకు ఆమధ్య కృతజ్ఞతలు తెలిపాడు. మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు సినీ, రాజకీయ…
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలతో బయటపడిన తేజ్ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇకపోతే ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు పంపారు. ఏ నోటీసులపై ఇప్పటివరకు తేజు స్పందించలేదని, అందుకే అతనిపై త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్…
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని కుటుంబ సభ్యులు, ఆసుపత్రి బృందం చెబుతున్న ఫ్యాన్స్ కాస్త నిరాశే వ్యక్తం చేశారు. కనీసం ఓ ఫోటోనైన షేర్ చేయొచ్చుగా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా దీనిపైనా సాయిధరమ్ తేజనే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘నాపై మరియు నా చిత్రం “రిపబ్లిక్” పై మీ ప్రేమ, ఆప్యాయతను చూపించినందుకు నా కృతజ్ఞతలు.. త్వరలోనే కలుద్దాం’ అంటూ సాయిధరమ్ తేజ్ తన చేతి సంజ్ఞతో కోలుకున్నాను అనే…
సుప్రీమ్ హీరో సాయితేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ అతను కోరుకున్నట్టుగా అక్టోబర్ 1న జనం ముందుకు వచ్చింది. ముందు రోజు రాత్రే టాలీవుడ్ ఫిల్మ్ పర్సనాలిటీస్ కోసం ప్రీమియర్ షోను వేశారు. సినిమా చూసిన వాళ్ళంతా సాయి తేజ్ నటనను, కథను తెరకెక్కించడంలో దర్శకుడు దేవ్ కట్టా చూపించిన నిజాయితీని అభినందిస్తున్నారు. ఇటీవలే కోమా లోంచి బయటకు వచ్చిన సాయి తేజ్, ఈ విజయాన్ని మనసారా ఆస్వాదించాలని అందరూ కోరుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుతూ, సోషల్ మీడియాలో సందడి…
మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. మూడు రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మరిచినట్లు తెలిపారు. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యబృందం వెల్లడించింది. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న సాయితేజ్, మాట్లాడగలుగుతున్నారని తెలిపింది. మరో రెండు, మూడురోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు పేర్కొంది. వినాయక చవితి రోజు రాత్రి…
టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని పేర్కొన్నారు. వెంటిలెటర్ తొలగించామని, సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు. మరికొద్ది రోజులు సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటారని వివరించారు. గత ఆదివారం సాయి ధరమ్ తేజ్‌కు వైద్యులు కాలర్ బోన్ సర్జరీని నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నదని వైద్యులు వివరించారు. సాయి ధరమ్ తేజ్ వినాయక…
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, నేడు సాయితేజ్‌ని అల్లు అర్జున్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయితేజ్‌కి యాక్సిడెంట్ జరిగినప్పుడు బన్నీ కాకినాడలోని ‘పుష్ప’ షూటింగ్‌లో ఉన్నారు. ఎప్పటికప్పుడు సాయితేజ్ ఆరోగ్యాన్ని తెలుసుకున్న బన్నీ.. హైదరాబాద్ వచ్చిన వెంటనే పరామర్శించారు. ఈ నెల 10న…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ పై హీరో శ్రీకాంత్, నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాంత్ వ్యాఖ్యలకు నరేష్ కౌంటర్ ఇచ్చారు. “నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావడం, హీరోగా ఎదగడం నేను చూశాను. నేను కూడా ఇండస్ట్రీలో 50 ఏళ్ల నుంచి ఉన్నాను. ఇక్కడే పుట్టి పెరిగాను. మా ప్యానల్‌లో నాకు అపోజిట్ గా పోటీ చేసి ఓడిపోయావు. నాకు…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నాల్రోజుల క్రితం యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ మీద తేజ్ నడిపిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఐసీయూలో తేజ్ కు చికిత్స జరుగుతోంది. ఆయన అభిమానులు, పలువురు సెలెబ్రిటీలు తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు తరచుగా సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తున్నారు.…