మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ లోని కమ్యూనిస్టు చనిపోయాడా?ఈటల సిద్ధాంతాలు, భావజాలం, వామపక్ష లక్షణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాజకీయ మనుగడ కోసం, కేసుల నుండి తప్పించుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈటల బీజేపీలో చేరారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి అనేక విధాలుగా నష్టం చేసిన బీజేపీలో ఈటెల రాజేందర్ ఎలా చేరాడు? బీజేపీలో ఈటలకు సముచిత గౌరవం దక్కేలా లేదన్నారు. బీజేపీ…