Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajinkya Rahane BCCI Pension: టీమిండియా మాజీ టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తాను తప్పుకుంటున్నట్లు జూలై 30న జింక్స్ ప్రకటించాడు. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రహానే.. 2023 జూలైలో ట్రినిడాడ్‌లో వెస్టిండీస్‌పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2020-21లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా జట్టుకు చారిత్రాత్మక విజయం అందించి భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాడు.
రిటైర్మెంట్ తర్వాత అజింక్య రహానేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ప్రతి నెలా పెన్షన్ అందనుంది. 2022లో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హయాంలో రిటైర్డ్ క్రికెటర్ల పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు నెలకు రూ.50 వేలుగా ఉన్న పెన్షన్‌ను రూ.70 వేలకు పెంచింది. 85 టెస్టులు ఆడిన రహానే అత్యున్నత పెన్షన్ కేటగిరీలో ఉండటంతో.. ఇకపై ప్రతి నెలా రూ.70 వేల పెన్షన్ అందుకోనున్నాడు.
Also Read
- OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
- Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
అయితే అజింక్య రహానేకు ఈ పెన్షన్ ఒక షరతుతోనే కొనసాగుతుంది. భవిష్యత్తులో అతను బీసీసీఐలో కోచ్‌గా, సెలెక్టర్‌గా లేదా ఏదైనా అధికారిక పదవిలో చేరి వేతనం తీసుకుంటే.. ఆ కాలంలో పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఆ బాధ్యతలు ముగిసిన తర్వాత మళ్లీ పెన్షన్ పునరుద్ధరించబడుతుంది. మొత్తంగా రిటైర్మెంట్ తర్వాత కూడా రహానేకు బీసీసీఐ నుంచి ఆర్థిక భరోసా కొనసాగనుంది. మాజీ క్రికెటర్ల ఆర్థిక భద్రతను కాపాడటం బీసీసీఐ బాధ్యత అని, వారు ఆటకు చేసిన సేవలను గుర్తించి రిటైర్మెంట్ తర్వాత కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందని అప్పట్లో సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. అలాగే అంపైర్ల సేవలను కూడా బీసీసీఐ ఎంతో విలువైనవిగా భావిస్తుందని చెప్పాడు.
అజింక్య రహానే తన అంతర్జాతీయ కెరీర్లో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 8000కు పైగా రన్స్ చేశాడు. టెస్టు క్రికెట్లో 5077 పరుగులు ఉండగా.. అందులో 12 సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన రహానే.. విదేశీ పిచ్‌లపై భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రిటైర్మెంట్ అనంతరం తన తదుపరి ప్రణాళికలను ఇంకా ప్రకటించకపోయినా.. యువ క్రికెటర్లకు మార్గదర్శకత్వం వహించాలనే ఆసక్తి ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?