AP Municipal Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. టీడీపీ-జనసేన హవా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Municipal Election Results: ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ అధికారిక కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,020 వార్డులకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం టీడీపీ 600కు పైగా వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, జనసేన 26, వైసీపీ 21, బీజేపీ 13 వార్డుల్లో ముందంజలో ఉన్నాయి.
ఇక, మున్సిపాలిటీల్లోనూ కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. పుంగనూరు, పెనుకొండ మున్సిపాలిటీలను టీడీపీ సొంతం చేసుకుంది. పుట్టపర్తి మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకోగా, ఆ పార్టీ అభ్యర్థి ఎం. ఈశ్వర్ మున్సిపల్ చైర్మన్గా విజయం సాధించారు. పిఠాపురంలోనూ జనసేన అభ్యర్థులు మంచి ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రధాన నగరాలైన గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, అనంతపురం కార్పొరేషన్లలోనూ కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని 96 వార్డుల్లో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మండపేటలో కూటమి 36 వార్డులను, కొవ్వూరులో 27 వార్డులను కైవసం చేసుకుంది.
Also Read
- Amaravati Flood: తుఫాన్ వేళ అమరావతికి వరద టెన్షన్..! క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఏడీసీ ప్రత్యేక నిఘా
- Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
- Arnab Cyclone Effect: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం.!
- YS Jagan : రాప్తాడు పాఠశాల దాడి బాధితురాలిని పరామర్శించిన వైఎస్ జగన్
వినుకొండ మున్సిపాలిటీలోనూ కూటమి విజయం సాధించింది. ఇక్కడ టీడీపీ 14, బీజేపీ 2, జనసేన ఒక స్థానంలో గెలుపొందగా, వైసీపీ ఒక వార్డును దక్కించుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డుల కౌంటింగ్ పూర్తయింది. ఇందులో టీడీపీ 15, జనసేన 4 స్థానాలు గెలుచుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాయి. వైసీపీ 7 స్థానాల్లో విజయం సాధించగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. మరోవైపు.. వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ పీఠాన్ని కూడా అధికారిక కూటమి కైవసం చేసుకుంది. మరోవైపు జగ్గయ్యపేటలో జనసేన అభ్యర్థి మేఘన ప్రత్యేక విజయాన్ని నమోదు చేశారు. 31వ వార్డులో పోటీ చేసిన ఆమె 540 ఓట్ల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. వాసిరెడ్డి పద్మ కుమార్తె అయిన మేఘన గెలుపు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు మెజారిటీ ప్రాంతాల్లో విజయాలు నమోదు చేస్తుండటంతో టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Florida Plane Crash: ఫ్లోరిడా ప్లేన్ క్రాష్.. లవర్కు పైలట్ చివరి మెసేజ్.. టెక్ వ్యాపారవేత్త కుటుంబం దుర్మరణం..
-
AP Municipal Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. టీడీపీ-జనసేన హవా!
-
Neha Bora: ‘‘ఆలయాల్లో పూజారుల అత్యాచారాలు’’.. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.!
-
Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Amaravati Flood: తుఫాన్ వేళ అమరావతికి వరద టెన్షన్..! క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఏడీసీ ప్రత్యేక నిఘా
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!