సాధారణంగా ఇంట్లో పాములు కనిపిస్తే భయపడి పరుగులు తీస్తాం. పామును ఇంటి నుంచి బయటకు పంపేవరకు కంగారుపడిపోతాం. అదే విమానంలో పాము కనిపిస్తే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి. ప్రయాణికులు ప్రాణాలను అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకే విమానం ఎక్కే ముందు ఫ్లైట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రయాణికుల వస్తువులను స్కాన్ చేస్తారు. మలేషియాకు చెందిన ఎయిర్ ఏసియా ఫ్లైట్ ఏకే 5748 విమానం కౌలాలంపూర్ నుంచి తవాకు బయలుదేరింది.
Read: Marriage: పూలకు గిరాకి… కుర్‌కురే ప్యాకెట్లతో అలంకరణ…
అలా బయలుదేరిన కాసేపటికి సిబ్బంది గది నుంచి పాము బయటకు రావడం ప్రయాణికులు గమనించారు. భయపడిన ప్రయాణికులు సిబ్బందిని అలర్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పైలట్ ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికుల ప్రాణాలు ముఖ్యమని అందుకే విమానాన్ని వెనక్కి మళ్లించినట్టు ఎయిర్ ఏసియా విమాన సంస్థ తెలియజేసింది. అయితే, విమానంలోకి పాము ఎలా వచ్చింది అనే అంశం పై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.