ఒకరోజు ముందుగానే పార్లమెంట్ నిరవధిక వాయిదా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటితో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి… ఓ వైపు 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్, మరోవైపు వివిధ సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళన, నిరసన కార్యక్రమాలతో హాట్ హాట్‌గా సాగిన పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, ఒక రోజు ముందుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడనున్నాయి.. ఇక, మంగళవారం సభలో ప్రవేశపెట్టిన “బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు 2021”ను స్టాండింగ్ కమిటీకి పంపే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.. కాగా, పార్లమెంట్ ఉభయసభలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..
Read Also: నేడు కర్నూలుకు సీఎం జగన్.. విషయం ఇదే..
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య నవంబర్ 29వ తేదీ నుంచి పలుమార్లు వాయిదా పడుతూ వచ్చాయి పార్లమెంట్ ఉభయసభలు… జులై-ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల సందర్భంగా సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించిన కారణంగా సస్పెండ్ అయిన 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలన్నది ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్ తో ఉభయసభల కార్యక్రమాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది.. ఇక, అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో రైతుల మృతికి కారకులని ఆరోపిస్తూ హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాని మంత్రివర్గం నుంచి తొలగించాలన్నది ప్రతిపక్ష ఎంపీల మరో డిమాండ్‌గా ఉంది.. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై తెలంగాణ ఎంపీలు ఆందోళన చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్‌కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!