Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
- అక్టోబర్ 29న శుక్రుడి ఉదయం.. ఏం మారనుంది?
- మేషం, వృశ్చిక రాశుల వారు ఈ విషయాల్లో జాగ్రత్త
- మీన రాశి వారు భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండాలి
- కన్యా రాశి వారు ఖర్చులపై నియంత్రణ పాటించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జ్యోతిష్య శాస్త్రంలో శుభ గ్రహంగా భావించే శుక్రుడు అక్టోబర్ 29, 2026 న అస్తమించిన స్థితి నుంచి ఉదయించబోతున్నాడు. ప్రేమ, వివాహం, ఆకర్షణ, భౌతిక సుఖాలు, కళలు , ఆర్థిక సమృద్ధికి కారకుడైన శుక్రుడి ఈ గమ్య మార్పు ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే, ఈ సమయంలో శుక్రుడు వక్రగతిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారు వ్యక్తిగత జీవితంలోనూ, ఆర్థిక విషయాలలోనూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో ఏయే రాశుల వారు తమ ప్రతి అడుగును ఆచి తూచి వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మేష రాశి
శుక్రుని సంచారంలో వస్తున్న ఈ మార్పు మేష రాశి వారికి ప్రేమ సంబంధాలు , భాగస్వామ్యాల విషయంలో పరీక్షా కాలంగా మారనుంది. ఈ సమయంలో పాత మనస్పర్థలు మళ్లీ తలెత్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీరు ఎంత నిబద్ధతతో పని చేసినప్పటికీ, చిన్నచిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. మీ భాగస్వామి పట్ల మరింత విశ్వాసంగా ఉండటం చాలా ముఖ్యం. కార్యాలయంలో వ్యాపార సంబంధిత వ్యక్తులతో విభేదాలు వచ్చే సూచనలున్నాయి. కాబట్టి, ఎవరితోనైనా భాగస్వామ్యాలు కుదుర్చుకునేటప్పుడు లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు పదిసార్లు ఆలోచించడం మంచిది. మీ ప్రశాంత స్వభావమే అనవసర సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించగలదు.
Also Read
- Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
- Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
- Zodiac Signs : దీపావళి తర్వాత మారనున్న గ్రహాల గతులు.. ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
- Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
పరిష్కారం: సంబంధాల్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం, మాటలను అదుపులో ఉంచుకోవడం , అనవసర ఖర్చులను నియంత్రించడం ఉత్తమం.
2. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు ఈ కాలంలో విలాసవంతమైన వస్తువుల కొనుగోలుపై మోజు విపరీతంగా పెరుగుతుంది. జీవనశైలిని మెరుగుపరచుకోవాలనే ఆత్రుతతో భారీగా ధనం ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ నిజమైన అవసరాలకు, కేవలం కోరికలకు మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరం. అలాగే, పాత సందేహాలు లేదా మనసులోని కోపతాపాలు మీ బంధాన్ని బలహీనపర్చకుండా జాగ్రత్త పడాలి. ఏవైనా సమస్యలు ఎదురైతే అందరి ముందు మీ అభిప్రాయాన్ని నిష్కపటంగా వ్యక్తపరచడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకత పాటించాలి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేముందు భవిష్యత్ ఫలితాల గురించి బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం.
పరిష్కారం: విలాసాల కోసం విపరీతంగా ఖర్చు పెట్టడం, భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. ఆర్థిక విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి.
3. మీన రాశి
మీన రాశి వారు ఈ కాలంలో భావోద్వేగ విషయాలను చాలా తెలివిగా, పద్ధతిగా నిర్వహించాల్సి ఉంటుంది. ఉద్యోగ స్థలంలో సహోద్యోగులతో పని ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. ఇతరులు మీ భావాలను వాటంతట అవే అర్థం చేసుకుంటారని ఆశించకుండా, మీ మనసులోని మాటను స్పష్టంగా బయటపెట్టడం మంచిది. వ్యాపారంలో భాగస్వామ్యాలు , ఆర్థిక బాధ్యతలను మరోసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరినైనా సంతోషపెట్టాలనే ఉద్దేశంతో అబద్ధాలు చెప్పడం ఈ కాలంలో మీకు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతుంది. పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని అడుగువేయడం వల్ల సమస్యల నుంచి బయటపడవచ్చు.
పరిష్కారం: మీ అవసరాలను స్పష్టంగా తెలపండి. భావోద్వేగ ఒత్తిడికి లోనై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.
4. కన్యారాశి
శుక్రుడి ప్రతికూల ప్రభావం కన్యారాశి వారిపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో వీరు తమ ఖర్చుల విషయంలో, వ్యక్తిగత సంబంధాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పాత ఖర్చులు, ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత అంశాలను మళ్లీ ఒకసారి బేరీజు వేసుకోవాల్సి వస్తుంది. అందం, వినోదం , జీవనశైలి కోసం బడ్జెట్‌కు మించి ఖర్చు చేయకండి. సంబంధాల్లో చిన్నచిన్న అభిప్రాయ భేదాలను పెద్దవిగా చేసి భూతద్దంలో చూడటం మానుకోండి. ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందైనా ఆ పరిస్థితులను లోతుగా విశ్లేషించడం చాలా ముఖ్యం.
పరిష్కారం: ఆలోచించకుండా చేసే కొనుగోళ్లకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఇతరులపై అతిగా ఆధారపడకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మేలు జరుగుతుంది.
తాజావార్తలు
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
-
Artificial Paneer Ban in AP: ఏపీలో పన్నీరు అమ్మకాలు బంద్..! ఏడాది పాటు నిషేధం
-
Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!