Parliament Winter Session : నిర్ణీత షెడ్యూలు కంటే వారం ముందే పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 29 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉంది.
నేటితో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి… ఓ వైపు 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్, మరోవైపు వివిధ సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళన, నిరసన కార్యక్రమాలతో హాట్ హాట్‌గా సాగిన పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, ఒక రోజు ముందుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడనున్నాయి.. ఇక, మంగళవారం సభలో ప్రవేశపెట్టిన “బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు 2021”ను స్టాండింగ్ కమిటీకి పంపే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం…