నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. కాన్పూర్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.
అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రులతో నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పలు కీలక విషయాలపై చర్చించనున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమంపై చర్చ జరుగనుంది. అంతేకాకుండా ఆరోగ్యం, విద్యపై స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు. వీటితో పాటు మరో 3 బిల్లులను ఏపీ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
బీసీ జనగణన తీర్మానాన్ని నేడు మంత్రి వేణు ఏపీ మండలిలో ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా ఏపీ మండలిలో బీసీ సంక్షేమం, విద్యుత్ సంస్కరణలు, రోడ్లపై చర్చ నిర్వహించనున్నారు.
హైదరాబాద్‌లో నేడు కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీకేయూ నేత రాకేశ్ టికాయత్ హజరుకానున్నారు. రైతు ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా ధర్నాలో రాకేశ్ టికాయత్ పాల్గొగనున్నారు. సాగు చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్ చేయనున్నారు.
నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.44,700లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.67,600 లుగా ఉంది.
తెలంగాణలో నేడు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రేపు తెలంగాణలో పొడి వాతావరణం ఉండనున్నట్లు వెల్లడించింది.