బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టారు. నేడు 3వ రోజు కూడా సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగనుంది.
ఉత్తర్ ప్రదేశ్‌లో నేడు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని 14 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించనున్న సరయూ సహర్ జాతీయ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 29 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి అంజిమేడు వరకు నేడు అమరావతి రైతుల మహపాదయాత్ర కొనసాగనుంది. ఈ రోజు 17 కిలోమీటర్ల మేర రాజధాని రైతులు పాదయాత్ర చేయనున్నారు.
అమరావతి రైతులు మహపాదయాత్ర ఈ నెల 15న ముగియనుంది. అయితే ఈ నెల 17న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పోలసులను ఆశ్రయించగా వారు అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో నేడు రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించనున్నారు.