దక్షిణాఫ్రికాలో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం నేడు భారత జట్టు ప్రకటించనుంది. 22 మందితో జంబో బృందాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఉద్యోగ విభజనపై వడవడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి ఉద్యోగులకు ఆప్షన్లు అందుబాటులో ఉంచనుంది. తొలుత ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో అమలు జరుగనుంది.
నేడు వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేయనుంది. నేటితో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ భేటీ ముగియనుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులలో కొత్త వడ్డీరేట్లను ఆర్బీఐ ప్రకటించనుంది.
నేడు అమరావతి హైకోర్టు న్యాయమూర్తులుగా మన్మథరావు, శ్రీభానుమతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు వారిచే సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
నేటి నుంచి ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టెస్టు జరుగనుంది. బ్రిస్బేన్ వేదికగా ఉదయం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్సీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు నిర్వహించే అవకాశం ఉంది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నిర్వహిస్తోన్న ఆందోళనలకు నేటితో తెరపడే అవకాశం ఉంది. నేడు ఎస్‌కేఎం సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
నేడు తెలంగాణలో ఎమ్మెల్సీగా బండ ప్రకాష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బండ ప్రకాష్‌చే ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి ప్రమాణం చేయించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీనేతలతో నేడు సమావేశం కానున్నారు. నేతలతో కుప్పం, రాజంపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు.
ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన 11 మంది ఎమ్మెల్సీలు నేడు ఏపీ మండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ ప్రమాణం చేయించనున్నారు.