దేశంలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా సొంత వాహనాలు ఉన్న వారు పెట్రోల్ ధరలు వింటే గుండె గుబేల్ అనే పరిస్థితి ఉంది. కారు బయటకు తీయాలంటే పెట్రోల్, డీజిల్ పోయాల్సిందే. మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. వీటితో పర్యావరణాని మేలు జరగడంతో పాటు ఇంధన బాధలు ఉండవు. దీంతో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ధర కాస్త ఎక్కువైన ఎలక్ట్రిక్ వాహనాలు కోనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఛార్జింగ్ ప్రధాన సమస్యగా మారింది. తక్కువ దూర ప్రయాణాలకు ఓకే.. కానీ సుదూర ప్రయాణాలు చేసే వారికి పదే పదే చార్జింగ్ పెట్టుకోవడం ఇబ్బంది. అందులోనూ ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నిప్రమాదాలకు గురవుతున్నా ఘటనలు ఉన్నాయి. తరచూ బ్యాటరీ సమస్య వేధిస్తుంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యాపారవేత్త వినూత్నంగా ఆలోచించాడు. పెట్రోల్, డీజిల్, ఛార్జింగ్ అవసరం లేని కారును రూపొందించాడు.
Also Read:Gudivada Amarnath: జనసేనాకు పదేళ్లుగా అజెండా లేదు.. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు
పశ్చిమ బెంగాల్‌కు చెందిన మనోజిత్ మాండల్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న పాత నానో కారును సోలార్‌గా మార్చాడు. ఈ కారుకు ఎలాంటి పెట్రోల్ అవసరం లేదు. ఇంజిన్ కూడా ఉండదు.తన కారు రూఫ్ టాప్‌పై సౌర పలకలను ఏర్పాటు చేశాడు. అవి సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి.. బ్యాటరీలకు అందజేస్తాయి. ఆ బ్యాటరీల సాయంతో కారు ముందుకు వెళ్తుంది.దాదాపు 100 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ కారులో ఇంజిన్ లేకపోవడం వల్ల స్టార్ట్ చేసినా శబ్ధం రాదు. ఇంజిన్ లేకపోయినా, గేర్ సిస్టమ్ ఉంది. నాలుగో గేర్‌లో దాదాపు సైలెంట్‌గా గంటకు 80 కి.మీ.ల వేగంతో దూసుకెళ్లగలదు. పెట్రోల్ అవసరం లేని ఈ కారు.. ఎండ ఉంటే ఎక్కడికైనా.. ఎంత దూరమైనా వెళ్లవచ్చు. ఈ కారుకు ఎలాంటి పెట్రోల్ అవసరం లేదు. అలాగే, ఇది ఇంజిన్‌లో పనిచేయదు. కారు రన్నింగ్ ఖర్చు అందరినీ షాక్ కి గురి చేస్తుంది.
Also Read: Stomach Bloating: కడుపు ఉబ్బరంగా ఉందా ?.. నివారణ మార్గాలు ఇవీ
ఈ “సోలార్ కారు” గ్యాసోలిన్ ఉపయోగించదు. కేవలం 30 నుంచి 50 రూపాయల ఖర్చరుతోనే దాదాపు 100 కిలోమీటర్లు నడుస్తుంది. మనోజిత్ మండల్‌కు చిన్నప్పటి నుంచి సృజనాత్మకత ఉంది. గ్యాస్ ధరల పెరుగుదలపైతో తనకు తానుగా సోలార్ వాహనాన్ని నిర్మించుకున్నారు. కారును మోడిఫై చేసే సమయంలో మనోజిత్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ, ఇంధనాల సమస్యను పరిష్కరించడంలో బంకురా జిల్లాకు చెందిన మనోజిత్ మండల్ అగ్రగామిగా నిలిచారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. సౌరశక్తితో నడిచే వాహనాన్ని రూపొందించడంతో మనోజిత్ అందరి దృష్టిని ఆకర్షించాడు.