దేశంలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా సొంత వాహనాలు ఉన్న వారు పెట్రోల్ ధరలు వింటే గుండె గుబేల్ అనే పరిస్థితి ఉంది. కారు బయటకు తీయాలంటే పెట్రోల్, డీజిల్ పోయాల్సిందే. మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు.