గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు..నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేసింది.
అల్పపీడనం కారణంగా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు..మంగళవారం నాడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.. వర్ష సూచన ఉండటంతో అధికారులు కూడా అలెర్ట్ అవుతున్నారు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు..
ఏపీ లో కూడా అల్పపీడన ప్రభావం ఏర్పడనుంది.. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రధానంగా కృష్ణా, ఏలూరు, కోనసీమ, ప్రకాశం, పల్నాడు, ఉభయగోదావరిజిల్లాలతో పాటుగా కర్నూలు, నంద్యాల, అనకాపల్లిజిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని హెచ్చరించింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు ప్రకటించారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు..