దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నది. మెగా క్యాంపులు నిర్వహిస్తూ వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇక కరూర్ జిల్లాలో వ్యాక్సిన్‌పై వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ఎక్కవ మంది వ్యాక్సిన్ వేయించుకునేలా అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారం వారం మెగా వ్యాక్సినేషన్ క్యాంపును నిర్వహిస్తున్న ప్రభుత్వం, రాబోయే ఆదివారం రోజున కూడా మెగా క్యాంపును నిర్వహిస్తోంది. వాలంటీర్లు ఎంత మందిని వ్యాక్సిన్ తీసుకోవాడానికి తీసుకొస్తే వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు అందించనున్నారు. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్నవారి పేర్లను లక్కీ డ్రా తీయనున్నారు. లక్కీడ్రాలో ప్రధమ బహుమతి గెలుచుకున్నవారికి వాషింగ్‌మిషన్‌ను, రెండో బహుమతిగా వెట్ గ్రైండర్‌ను, మూడో బహుమతిగా మిక్సీని ఇవ్వనున్నారు. అంతేకాదు, నాలుగో బహుమతి కింద 25 మందికి ప్రెషర్ కుక్కర్లు, స్పెషల్ బహుమతి కింద 100 మందికి వంట పాత్రలు ఇవ్వనున్నారు.
Read: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ అనూహ్య నిర్ణయం… హెడ్ క్వార్టర్స్ తరలింపుకు సిద్ధం…