తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. కారులోని ఐదుగురు సజీవదహనమయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న ముసిరి పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది దాదాపు గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. మంటలను ఆర్పిన అనంతరం మృతదేహాలను కారులో…
నిత్యం ఎక్కడో ఒకచోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్ళుమూసుకుపోయిన మగాళ్లు, మృగాళ్ళుగా మారి ఆడవారిపై అత్యచారాలకు పాల్పడుతున్నారు. చిన్నా, పెద్ద.. వావివరుస అనే విచక్షణ మరిచి ప్రవరిస్తున్నారు. లైంగిక వేధింపులకు ఎంతోమంది చిన్నారులు బలవుతన్నారు. తాజాగా ఒక బాలిక లైంగిక వేధింపులు తట్టుకోలేక దారుణానికి ఒడిగట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్నా ఆమె ఈ మృగాళ్ల మధ్య ఉండలేక తనువు చాలించింది. ఈ విషాద ఘటన తమిళనాడులో కరూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కరూర్…
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నది. మెగా క్యాంపులు నిర్వహిస్తూ వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇక కరూర్ జిల్లాలో వ్యాక్సిన్‌పై వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ఎక్కవ మంది వ్యాక్సిన్ వేయించుకునేలా అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారం వారం మెగా వ్యాక్సినేషన్ క్యాంపును నిర్వహిస్తున్న ప్రభుత్వం, రాబోయే ఆదివారం రోజున కూడా మెగా క్యాంపును నిర్వహిస్తోంది. వాలంటీర్లు ఎంత మందిని వ్యాక్సిన్ తీసుకోవాడానికి తీసుకొస్తే వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు అందించనున్నారు. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్నవారి…