ఆ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత… మార్గదర్శకాలు ఇవే…

ఉత్త‌ర భార‌త‌దేశంలో ముఖ్య‌మైన యాత్ర‌ల్లో ఒక‌టి చార్‌ధామ్ యాత్ర‌.  ఈ యాత్ర‌మై ప‌రిమితుల‌ను ఎత్తివేస్తూ ఉత్త‌రాఖండ్ హైకోర్టు నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ప‌రిమితులు ఎత్తివేయ‌డంతో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.  యాత్ర‌కు వెళ్లే భ‌క్తుల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు లేవ‌ని, అయితే, ద‌ర్శ‌నాల విష‌యంలో చార్‌ధామ్ బోర్టులోని పోర్ట‌ల్‌లో వివ‌రాలు త‌ప్ప‌నిస‌రిగా న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.  ప్ర‌స్తుతం బ‌ద్రీనాథ్ ద‌ర్శ‌నానికి 1000 మందిని, కేదారీనాథ్ కు 800 మందిని, గంగోత్రికి 600, య‌మునోత్రికి 400 మంది భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తూ వ‌స్తున్నారు.  హైకోర్టు ప‌రిమితుల‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేయ‌డంతో ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  అయితే, యాత్ర‌కు వ‌చ్చే భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా పూర్తిస్థాయి వ్యాక్సిన్ తీసుకున్న‌ట్టుగా స‌ర్టిఫికెట్‌, లేదా 72 గంటల్లోగా తీసుకున్న క‌రోనా నెగెటివ్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొన్న‌ది. 

Read: అక్టోబ‌ర్ 7, గురువారం దిన‌ఫ‌లాలు

-Advertisement-ఆ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత... మార్గదర్శకాలు ఇవే...

Related Articles

Latest Articles