ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ టారిఫ్ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. 20 నుంచి 25 శాతం రేట్లు పెంచింది ఎయిర్ టెల్. తన ప్రీపెయిడ్ కస్టమర్లకు షాకిచ్చింది వోడా ఫోన్ ఐడియా. ఎయిర్ టెల్ బాటలోనే ఆదాయంపై ఫోకస్ పెట్టాయి. ప్రైవేట్ టెలికాం రంగంలోని మిగతా కంపెనీలైన వొడాఫోన్ ఐడియా ఇండియా, రిలయన్స్ జియో కూడా త్వరలోనే ఛార్జీలు పెంచే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా, తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వొడాఫోన్ ఐడియా రేట్లు పెంచేందుకు రెడీ అయిందని అంటున్నారు. టెలికాం రంగ పునరుద్ధరణకు చార్జీల పెంపు కీలకంగా మారిందని జూలై-సెప్టెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాల అనంతరం వొడాఫోన్ ఐడియా సీఈఓ రవీందర్ టక్కర్ అన్నారు. టారిఫ్ పెంపుపై కంపెనీ కసరత్తు చేస్తోందని, త్వరలో ప్రకటించవచ్చని ఆయన సంకేతాలు కూడా ఇచ్చారు.
READ ALSO ఎయిర్ టెల్ బాదుడు.. 25 శాతం వరకూ టారిఫ్ పెంపు
నవంబర్ 25 నుంచి టారిఫ్ రేట్లు 25 శాతం పెంచుతోంది. రూ79రూపాయల ప్లాన్ 99 రూపాయలు కానుంది. రూ 149 ప్లాన్ కాస్తా 179 పెరగనుంది. అంటే 20 నుంచి 30 రూపాయలు అదనపు భారం కానుంది. 1498 రూపాయలుగా వున్న ప్లాన్ కాస్తా రూ.1799 కానుంది. అంటే కస్టమర్ల జేబులు భారీగానే గుల్లచేయనుంది. అలాగే, రూ2399 ప్లాన్ 2899 కానుంది. అంటే 500 రూపాయలు పెరగనుందన్నమాట. డేటా టాప్ అప్స్ కూడా రూ 58, రూ.118, రూ 298, రూ.418 కానున్నాయి.