ఈ పురుగుల ప‌చ్చ‌ళ్లు, ఐస్‌క్రీమ్‌లు అక్క‌డ య‌మా ఫేమ‌స్‌…

ఇప్పుడంటే ర‌క‌ర‌కాల ఆహార‌ప‌దార్ధాలు అందుబాటులోకి వ‌చ్చాయి.  చికెన్, మ‌ట‌న్‌, ఫిష్ ఇలాంటి ఆహారం అందుబాటులో ఉన్న‌ది.  అయితే, రాబోయే రోజుల్లో వీటికి కొర‌త ఏర్ప‌డే అవ‌కాశం ఉండొచ్చ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  దానికి ప్ర‌త్యామ్మాయం కీట‌కాల‌తో త‌యారు చేసిన వంట‌లే అని అంటున్నారు.  ఒక‌ప్పుడు గ్రామాల్లో,  అడ‌వుల్లో నివ‌శించే ప్ర‌జ‌లు మిడ‌త‌లు, ఉసుళ్లు, చీమ‌లు వంటి వాటిని ఆహారంగా తీసుకునేవారు.  ఉసుళ్ల‌తో చేసిన ఆహారం, వేపుళ్లు రుచిగా ఉండ‌ట‌మే కాదు, ఆరోగ్యానికి మంచిది కూడా.  రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.  సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్షిస్తుంది.  కాగా, చ‌త్తీస్‌గ‌డ్‌లోని ఆదివాసీలు ఆహారంగా తీసుకొనే చీమ‌ల చెట్నీ చాప్‌డా ని కార్పోరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున మార్కెట్‌లో అమ్ముతున్నారు.  అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో బతికున్న చీమ‌ల‌తో ఐస్‌క్రీమ్‌ల‌ను త‌యారు చేసి అమ్ముతుండ‌గా, కొన్ని ప్రాంతాల్లో బొద్దింక‌ల పాల‌తో చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారు.  

Read: మ‌న‌దేశంలో తొలి బుల్లెట్ బండిని వాడింది ఎవ‌రో తెలుసా?

Related Articles

Latest Articles