వందేళ్లయినా ఇప్పటికీ కనిపించని ఆ ట్రైన్… మిస్టరీగా మిగిలిపోయిన 104 మంది అదృశ్యం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. కొన్ని మిస్టరీలు మేధావులకు ఛాలెంజ్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి మిస్టరీల్లో ఒకటి ఇటలీలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్. 1911లో ఇటలీలో జెనట్టీ అనే రైలు రోమన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రయాణ మార్గంలోని లాంబార్టీ అనే కొండ ప్రాంతంలోని కిలోమీటర్ పొడవైన సొరంగమార్గంలోకి ప్రవేశించిన రైలు సడెన్‌గా మాయమైంది. సొరంగమార్గంలోకి ప్రవేశించే ముందు పొగ రావడంలో ఇద్దరు ప్రయాణికులు కిందకు దూకేశారు. ఆ తరువాత రైలు సొరంగంలోకి ప్రవేశించింది. లోపలికి వెళ్లిన రైలు అవతలి మార్గం నుంచి బయటకు రాలేదు. ఒకవేళ ప్రమాదం జరిగింది అనుకుంటే లోపల ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కనిపించాలి. అలాంటివి ఏవీ అక్కడ కనిపించలేదు. రైలులో ఉన్న 104 మంది ఏమయ్యారో ఇప్పటి వరకు తెలియలేదు. ఆ రైలు కోసం, రైల్లో ప్రయాణించిన ప్రయాణికుల కోసం ఇటలీ ప్రభుత్వం అప్పట్లో చాలా ప్రయత్నాలు చేసింది. రైలు పట్టాలపై మాత్రమే ప్రయాణించే రైలు ఎటు వెళ్లి ఉంటుంది అన్నది అర్థంగాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా ఆ మిస్టరీని ఛేదించలేకపోయారు.
Read: కరెంట్, నీరు లేని ఆ ఇంటి ఖరీదు ఐదు కోట్లా…!!
Also Read
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
తాజావార్తలు
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
-
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
-
Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!