Music Director Chakri: కుర్రకారును కిర్రెక్కించే బాణీలతో భలేగా సాగారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. అప్పట్లో చక్రి సంగీతంలో రూపొందిన వందలాది గీతాలు సంగీత ప్రియులను అలరించాయి.
నేడు టాప్ స్టార్ గా సాగుతున్న ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ కెరీర్ లో మరపురాని, మరచిపోలేని చిత్రంగా ‘దేశముదురు’ నిలచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తొలి చిత్రమిది. ఈ సినిమా బన్నీ కెరీర్ లో పలు రికార్డులను నమోదు చేసింది. బన్నీ కెరీర్ లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన సినిమాగానూ, ఆయన నటజీవితంలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఏకైక చిత్రంగానూ నిలచింది. అప్పట్లో బన్నీ మూవీస్ లో…
సరిగమలతో సావాసం చేస్తూ, పదనిసలతో పయనించాలని చక్రి బాల్యం నుంచీ తపించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి సహకారంతో కాసింత సంగీతం నేర్చి, ఆ పై సాధనతో పట్టు సాధించారు. ఆరంభంలో ఓ ఆల్బమ్ తయారు చేసి, తన బాణీలు వినిండి అంటూ సినిమా రంగంలో తిరగసాగారు చక్రి. అప్పుడు ఈ పోరడు ఏం సంగీతం చేయగలడు అని పెదవి విరిచినవారే అధికం! అయితే ఆ పోరడు బాణీలతో ఆడుకొనే వీరుడు అని కొందరు అభిరుచిగల సినీజనం భావించారు.…