School Shooting: స్కూల్లో ఆకస్మికంగా కాల్పులు.. విద్యార్థులు సహా ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాల్లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. టెన్నెస్సీలోని నాష్‌విల్లేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక మహిళ కాల్పులు జరపడంతో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రీ-స్కూల్ నుండి ఆరవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ప్రైవేట్ క్రిస్టియన్ పాఠశాల అయిన నాష్‌విల్లేలోని పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల వయసున్న ముగ్గురు పిల్లలకు తుపాకీ గాయాలు ఉన్నాయని అధికారులు తెలిపారు వాండర్‌బిల్ట్‌లోని మన్రో కారెల్ జూనియర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చేరుకున్న తర్వాత వారు చనిపోయినట్లు ప్రకటించారు. మిగత బాధితులందరూ 60 ఏళ్లు పైబడిన వారేనని అధికారులు తెలిపారు.
Alsor Read:Bhatti Vikramarka: రాష్ట్రాన్ని కేసీఆర్ 70 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు.. బీఆర్ఎస్ పాలనంతా స్కాములమయం
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
నిందితురాలు 28 ఏళ్ల యువతి ఆడ్రీ హేల్‌గా మెట్రోపాలిటన్ నాష్విల్లే పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించింది. ఘటన జరిగిన అనంతరం ఆమెని పోలీసులు కాల్చివేశారు. నిందితురాలు నాష్విల్లే నివాసిగా గుర్తించారు.హేల్ వద్ద అసాల్ట్ రైఫిల్, తుపాకీ, అలాగే పిస్టల్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. హేల్ పాఠశాలలో మాజీ విద్యార్థిగా భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడి పాఠశాలలోని లాబీ తరహా ప్రాంతం వద్ద జరిగిందని, తరగతి గదిలో కాదని పోలీసు అధికారి తెలిపారు. స్కూల్లో జరిగిన కాల్పులపై అధ్యక్షుడు జో బిడెన్‌కు సమాచారం అందించామని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ తెలిపారు.అయితే, నిందితురాలు ఎందుకు కాల్పులు జరిపింది అనే దానిపై సమాచారం లేదు.
Alsor Read:Rashmika Mandanna: నేషనల్ క్రష్.. బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టింది
కాగా, యూఎస్‌లో స్కూల్లో కాల్పుల ఘటనలు సర్వసాధారణంగా మారాయి. కొద్ది రోజుల క్రితం డెన్వర్ పాఠశాలలోని అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిలో ఇద్దరు సభ్యులను కాల్చి గాయపరిచిన తర్వాత 17 ఏళ్ల యువకుడు ఘోరంగా కాల్చి చంపబడ్డాడు. శాండీ హుక్ ప్రామిస్, కనెక్టికట్‌లోని శాండీ హుక్ పాఠశాలలో 2012లో జరిగిన మారణకాండ జరిగింది.
తాజావార్తలు
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్‌లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?