ఇళయ దళపతి విజయ్ బర్త్ డే జూన్ 22న. అయితే ఆయన పుట్టినరోజుకు ఒకరోజు ముందే సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. దేశవ్యాప్తంగా విజయ్ అభిమానులు ఆయన సీడీపీలతో నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ 65వ చిత్రం రూపొందుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన అప్డేట్ ను దర్శకుడు నెల్సన్ రివీల్ చేశారు.
Read Also : డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుప్రీం హీరో
విజయ్ 65 చిత్రం “బీస్ట్” టైటిల్ తో తెరకెక్కుతోందని తెలుపుతూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ లో విజయ్ గన్ తో బీస్ట్ మోడ్ లో కన్పించి అభిమానులను థ్రిల్ చేశారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. చాలా గ్యాప్ తరువాత పూజాహెగ్డే మళ్ళీ తమిళంలో రీఎంట్రీ ఇస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక “బీస్ట్” తెలుగులో కూడా ఇదే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రం తరువాత విజయ్ డైరెక్ట్ తెలుగు మూవీ పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా… స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారధ్యం వహించనున్నారు.