డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుప్రీం హీరో

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయితేజ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం రాజకీయాలు ప్రస్తుత పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… ఇందులో జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన ‘రిపబ్లిక్’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో తెలంగాణలో లాక్ డౌన్ కూడా ఎత్తివేశారు. దీంతో సినిమాల కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నాయి. తాజాగా సాయి ధరమ్ తేజ్ కూడా “రిపబ్లిక్” కోసం డబ్బింగ్ స్టార్ట్ చేశారు.

Read Also : మరో మైల్ స్టోన్ చేరుకున్న మెగా పవర్ స్టార్

ఇక కరోనా కారణంగా ఈ చిత్రం ప్రముఖ ఓటిటి వేదికపై విడుదల కానుందంటూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. ఇక లాక్ డౌన్ కూడా తీసేయడంతో త్వరలోనే థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని భారీ సినిమాలు మాత్రం 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిచే వరకు ఎదురు చూస్తున్నాయి. కానీ చిన్న, మిడ్ లెవెల్ చిత్రాలు వరుసగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. ఇక త్వరలోనే పెద్ద తెరపై సినిమాల జాతర జరగనుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-