Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Telangana Congress Analysis On Huzurabad Bypoll Failure

కాంగ్రెస్‌లో హుజురా”బాధ” తీరేదెలా?

Published Date :November 6, 2021 , 4:45 pm
By NTV WebDesk
కాంగ్రెస్‌లో హుజురా”బాధ” తీరేదెలా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో జరిగిన ఒక ఉప ఎన్నిక జాతీయ పార్టీ కాంగ్రెస్ ని కుదిపేస్తోంది. పార్టీ పరాజయం నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గత నెల 30 జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి అక్కడ డిపాజిట్లు గల్లంతయ్యాయి. పార్టీ పరువు పోయిందని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు సైతం ఎన్నికల ఫలితాల తర్వాత పోస్టుమార్టం చేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వెయ్యం అని జనం డైరెక్ట్‌గా చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఎంతో సమయం వున్నా… అభ్యర్ధి విషయంలో చివరి వరకూ తాత్సారం చేశారని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అభిప్రాయంతో వున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి.

Also Read

  • Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
  • Punjab: ‘‘పంజాబ్‌ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ

హుజురాబాద్‌లో కనీసం 40 వేల ఓట్లయినా వస్తాయని రేవంత్ సహా నేతలంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. 40 వేలు కాదు కదా కనీసం 4 వేలయిన ఓట్లు రాలేదు. హుజురాబాద్ లో మొత్తం 2,37,036 ఓట్లు కాగా..ఇందులో 2,05,236 పోలయ్యాయి. ఇందులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 1,07,022 పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 83,167 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ 3,014 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒక జాతీయ పార్టీకి అంత తక్కువ ఓట్లు రావడంతో కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ అయింది.

దీంతో సీనియర్లు నష్టనివారణ ప్రారంభించారు. హుజురాబాద్ పరాజయంపై అంతర్గత విచారణ జరిపామన్నారు మాజీ ఎంపీ, సీనియర్ నేత వి.హనుమంతరావు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కి చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వారికి నచ్చ జెప్పే బాధ్యత విహెచ్‌కి అప్పగించింది కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ. ఈనేపథ్యంలో సీనియర్ నేతలు పార్టీకి దూరంగా ఉండడం మంచిది కాదన్నారు వీహెచ్. ఇవాళ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ చేయని ధైర్యం సోనియా గాంధీ చేశారని..తానేమీ పెద్ద నాయకుడిని కాదన్నారు.

గత ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు పాడి కౌశిక్ రెడ్డి. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడంతో అక్కడ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనుకున్నారు కేసీఆర్. కానీ టీఆర్ఎస్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. కేసీఆర్ వ్యతిరేక ఓటు బ్యాంకు అంతా ఈటలకు పడింది. కౌశిక్‌రెడ్డి తోనే కేసీఆర్ ఓడిపోయారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తే 30,40 వేల ఓట్లు వచ్చేవంటున్నారు. కౌశిక్ రెడ్డితో ఈటెలకు ఓట్లు తగ్గి కేసీఆర్ గెలిచేవారని వ్యాఖ్యానించారు. కౌశిక్‌రెడ్డి చేరితే.. 60 వేల ఓట్లు టీఆరెస్‌కు వస్తాయని కేసీఆర్ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోలైన 2,05,236 ఓట్లలో 34,206 ఓట్లు వస్తే బల్మూరికి డిపాజిట్ దక్కేది. కానీ ఎవరూ ఊహించని విధంగా బల్మూరికి 3014 ఓట్లు మాత్రమే వచ్చాయి.హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రత్యర్థి పార్టీలకు కాంగ్రెస్ పోటినివ్వకపోగా.. ఘోరంగా డిపాజిట్ కోల్పోవడంతో ఏంచేయాలో తోచడం లేదు ఆ పార్టీ నేతలకు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • huzurabad
  • huzurabadbypoll
  • Komatireddy
  • Revanth
  • telangana Congress

తాజావార్తలు

  • Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!

  • CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!

  • Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!

  • Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..

  • Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions