Kishan Reddy: కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు లక్షల కోట్లు అప్పు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంధకార భవిష్యత్తుగా మారిందని వ్యాఖ్యానించారు.
బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అధికార టీఆర్ఎస్ ఓర్వలేక పోతుందన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్. ప్రజా సంగ్రామ యాత్ర ప్రగతిభవన్ లో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మోకాళ్ళ యాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు లక్ష్మణ్. వెనుకబడిన పాలమూరు ప్రజలను టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం దగా చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24గంటల ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నామని తెరాస నేతలు పదే పదే…
ప్రధాని కాన్వాయ్ ను అడ్డుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా రాష్ట్రపతికి నివేదించండి అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి వినతి పత్రం అందజేసింది బీజేపీ ప్రతినిధి బృందం. ఈనెల 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ప్రధానమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపడంతోపాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖకు నివేదించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గవర్నర్…
కరీం నగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీక్షా శిబిరం దగ్గర పోలీసులు-బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరీంనగర్ ఎంపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారీగా మోహరించారు పోలీసులు. డౌన్ డౌన్ కేసీఆర్ అని మహిళా నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి…