NTV Telugu Site icon

Sandeshkhali: బెంగాల్ సర్కార్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..!

Sue'e

Sue'e

సందేశ్‌ఖాలీ ఘటనను కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం తదుపరి విచారణను జూలైకి ధర్మాసనం వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Murder in Madchal: మేడ్చల్‌ దారుణం.. మినీ సిలిండర్‌ తో వ్యక్తిపై దాడి..

తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ భూకబ్జా, లైంగిక వేధింపులకు పాల్పడ్డరంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో సందేశ్‌ఖాలీ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం ఈ ఆందోళనలకు బీజేపీ కూడా మద్దతు తెలిపింది. నిరసనలు తీవ్రం కావడంతో కలకత్తా హైకోర్టు ఆదేశాలతో నిందితుడు షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హైకోర్టు.. దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. పైగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ జరిగిన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంటిపై సీబీఐ దాడులు చేసి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారం కూడా బెంగాల్ ప్రభుత్వానికి రుచించలేదు. దీంతో కలకత్తా హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం విచారణ చేపట్టి జూలైకి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Sanjay Singh: ఈసారి ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం బీజేపీలో కనిపిస్తుంది..

ఇదిలా ఉంటే ఇటీవల ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సందేశ్ ఖాలీ బాధిత మహిళలను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని ఆవేదన చెందారు. అంతేకాదు సందేశ్‌ఖాలీ బాధిత మహిళకు బీజేపీ లోక్‌సభ సీటును కూడా ప్రకటించింది. మొత్తానికి సందేశ్‌ఖాలీ ఇష్యూను బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది.

ఇది కూడా చదవండి: NTR : అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. పిక్ వైరల్..