Stray dog: వీధి కుక్క నోటిలో నవజాత శిశువు.. విచారణ కోసం ప్రత్యేక బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీధి కుక్కల దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వీధి కుక్కల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే, కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. మార్చి 31న కుక్క తన నోటిలో బిడ్డను మోస్తూ కనిపించింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని మెక్‌గన్ ఆసుపత్రి ప్రాంగణంలో వీధికుక్క నోటిలో పసికందును మోసుకెళ్లిన కేసును దర్యాప్తు చేయడానికి కర్ణాటక పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. కేసు నమోదు చేసుకున్న శివమొగ్గలోని దొడ్డపేట పోలీసులు నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఈ మధ్య కాలంలో జరిగిన శిశువుల ప్రసవాల వివరాలను రాబడుతున్నారు.
Also Read:Prisoner Escape: సబ్ జైలు నుంచి ఖైదీ పరారీ.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
Also Read
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మార్చి 31న కుక్క నోటిలో పసికందును మోస్తూ కనిపించింది. ఈ విషయమై ఓ మహిళా సెక్యూరిటీ గార్డు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 31న ఉదయం 6 గంటలకు ఆసుపత్రిలో విధులకు హాజరుకాగా, పాపను కుక్క మోసుకెళ్తున్నట్లు ప్రజలు తమకు సమాచారం అందించారని గార్డు పోలీసులకు చెప్పాడు. ప్రసూతి వార్డు నుంచి బయటకు వస్తున్న కుక్క కూడా కనిపించింది. గార్డు ఆవరణలో వెతకగా కుక్క నోటిలో బిడ్డను పట్టుకుని కనిపించింది. పాప శవమై కనిపించింది. పసికందును వీధికుక్క చంపిందా అనే విషయంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్‌మార్టంలో ప్రీమెచ్యూర్ డెలివరీ అని తేలింది. మెక్‌గన్ ఆసుపత్రిలో శిశువు ప్రసవం జరగలేదని అధికారులు పోలీసులకు చెప్పారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిని కోరారు. పోలీసులు శరీర భాగాల నమూనాలను డీఎన్ఏ పరీక్షకు పంపుతున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!