పాక్‌లో భారీ భూకంపం… 15 మంది మృతి…

పాకిస్తాన్‌లోని బ‌లూచిస్తాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభ‌వించింది.  ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి.  తెల్ల‌వారుజామున భూకంపం సంభ‌వించ‌డంతో దాదాపుగా 15 మంది మృతి చెందారు.  200 మందికి పైగా గాయాల‌య్యాయి.  బ‌లూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో ఆ భూకంపం సంభ‌వించింది.  మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.  ప్ర‌స్తుతం భూకంపం సంభ‌వించిన ప్రాంతంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.  రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 6 గా న‌మోదైంది.  భూకంపాలు సంభ‌వించే జోన్‌లో బ‌లూచిస్తాన్ ప్రావిన్స్ కూడా ఉన్న‌ది.  ఈ ప్రాంతంలో త‌ర‌చుగా భూప్ర‌కంప‌న‌లు సంభ‌విస్తుంటాయి.  ఈసారి తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  

Read: పంజాబ్ ఫైట్‌: ముఖ్య‌మంత్రుల మ‌ధ్య పెరిగిన మాట‌ల యుద్ధం…

-Advertisement-పాక్‌లో భారీ భూకంపం... 15 మంది మృతి...

Related Articles

Latest Articles