Samantha: ఆ అమాయక సమంత ఇప్పుడు లేదు.. ఇక రాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: సమంత.. సమంత.. సమంత.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు మారుమ్రోగిపోతోంది. ఆమె నటించిన శాకుంతలం ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో 3డీలో రిలీజ్ అవుతోంది. దుశ్యంత- శకుంతల అందమైన ప్రేమ కావ్యంగా ఈ సినిమాను తెరకెక్కించాడు గుణశేఖర్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై హైప్ ను తీసుకొచ్చాయి. ఇక మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకొని బయటికి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అన్ని తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఒక స్ట్రాంగ్ విమెన్ గా తయారయ్యింది సామ్. ఇక తాజగా జరిగిన మీడియా సమావేశంలో ఇదే ప్రశ్న ఆమెకు ఎదురయ్యింది.
Dasara Delete Scene: ఎందుకయ్యా.. ఇంత మంచి సీన్ ను తీసేశారు
Also Read
- Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
- Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Oscars Academy :'RRR' ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
” నాకోసం యుద్దాలు జరగాలి అని ఎంతో అమాయకత్వంగా నటించిన సమంత.. ఇప్పుడు స్ట్రాంగ్ గా ఫైట్స్, యాక్షన్ చేస్తోంది. సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఫైట్ చేస్తోంది. అప్పుడు సమంతకి ఇప్పుడు ఉన్న సమంతకు మధ్య తేడా ఏంటి.. ఎలా ఆ సమంత ఇలా మారింది” అన్న ప్రశ్నకు సామ్ మాట్లాడుతూ.. ” అప్పుడు నాకు ఇన్ని ప్రాబ్లెమ్స్ లేవు. అప్పుడు అమాయకత్వంగా ఉన్నాను. అప్పుడు అన్ని ఉన్నాయి. కంఫర్ట్ గా ఉన్నాను.. ఇప్పుడు మాత్రం అలా లేవు. కానీ, ఇలాంటి పరిస్థితి వస్తుంది అని నాకు తెలియదు. నా ప్లేస్ లో ఎవరున్నా.. దానికి తగ్గట్టుగానే మారతారు. ఇప్పుడు ఈ స్ట్రగుల్స్ వచ్చాయి.. వాటిని ఎదుర్కొంటున్నాను.. అలా అలవాటు అయ్యింది. ఎవరైనా ఇలాంటి స్ట్రగుల్స్ ఎదురైతే ఎలా స్ట్రాంగ్ అవుతారో.. నేను కూడా అంతే.. ఆ అమాయకమైన సమంత ఇప్పడూ స్ట్రాంగ్ అయ్యింది” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు సామ్ నువ్వు స్ట్రాంగ్.. ఇక ఆ అమాయకమైన సమంతను ఇకముందు కూడా రానివ్వకు అంటూ చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్‌గా నియమితురాలైన ముస్కాన్
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!