Setback For Opposition: కేంద్ర సంస్థల దుర్వినియోగంపై విపక్షాలకు ఎదురుదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు, భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నమోదు చేసిన కేసుల సంఖ్యలో విపరీతంగా పెరిగిందని ప్రతిపక్ష పార్టీల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారని తెలిపారు.
Also Read:Uppena Remake: దళపతి విజయ్ కొడుకుతో సేతుపతి సిద్ధం…
గత దశాబ్దంలో కంటే గత ఏడేళ్లలో ఈడీ 6 రెట్లు ఎక్కువ కేసులు నమోదు చేసిందన్నారు. అయితే కేవలం 23 శాతం మాత్రమే నేరారోపణలు ఉన్నాయని సింఘ్వీ గణాంకాలను ఉదహరించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో 95 శాతం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయని, ఇది రాజకీయ పగ, పక్షపాతానికి స్పష్టమైన నిదర్శనమని ఆరోపించారు.
Also Read
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
- Nandu World: వాళ్లిద్దరూ యూట్యూబ్లో ఫేమస్.. చేసేది మాత్రం..!
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
అయితే, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ పిటిషన్ చెల్లుబాటు, సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ, ప్రాసిక్యూషన్ నుండి ప్రతిపక్ష పార్టీలకు మినహాయింపును కోరుతున్నారా ? పౌరులుగా వారికి ఏదైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా? అని సింఘ్వీని అడిగారు. తాను ప్రతిపక్ష నేతలకు ఎలాంటి రక్షణ లేదా మినహాయింపు కోరడం లేదని, చట్టాన్ని న్యాయమైన, నిష్పక్షపాతంగా వర్తింపజేయడం కోసమేనని సింఘ్వీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం తమ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు విఘాతం కలిగిస్తోందన్నారు. నిందితులను అరెస్టు చేయడానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పలువురు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని, ఇది ప్రజాప్రతినిధులుగా విధులు నిర్వర్తించే వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.
Also Read:Kolagatla Veerabhadra Swamy: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.. అప్పులు సహజం..!
అయితే, సింఘ్వీ వాదనలను ప్రధాన న్యాయమూర్తి తొసిపుచ్చారు. ఈ పిటిషన్ తప్పనిసరిగా రాజకీయ నాయకుల కోసం ఒక విజ్ఞప్తి అని అన్నారు. అవినీతి లేదా నేరపూరితంగా ప్రభావితమయ్యే ఇతర పౌరుల హక్కులు, ప్రయోజనాలను పిటిషన్ పరిగణనలోకి తీసుకోలేదని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. కేవలం రాజకీయ నాయకుల కోసం సుప్రీంకోర్టు సాధారణ మార్గదర్శకాలు లేదా సూత్రాలను నిర్దేశించలేదని, వ్యక్తిగత కేసులను కోర్టు ముందుంచడం మరింత సముచితమని ఆయన అన్నారు. సింఘ్వీ తన ఆందోళనలను పార్లమెంటులో లేవనెత్తవచ్చని కూడా ఆయన సూచించారు. రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించలేమని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో.. ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని విపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోరారు. ఇందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది.
తాజావార్తలు
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!