అలర్ట్: ఎల్లుండి నుంచి కొత్త ఛార్జీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ రేపటితో ముగిసిపోనుంది.. ఎల్లుండి జులైలోకి ఎంట్రీ అవుతున్నాం.. అంతే కాదు.. కొత్త బాదుడు కూడా షురూ కాబోతోంది… దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఛార్జీలను వడ్డించేందుకు సిద్ధమైంది.. ఏటీఎం, బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా చేసే నగదు విత్‌డ్రాలపై సేవా రుసుములను సవరిస్తూ నిర్ణయిం తీసుకుంది ఎస్బీఐ… చెక్‌బుక్, నగదు బదిలీ, ఇతర ఆర్థికేతర లావాదేవీలకు కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్‌బీడి) ఖాతాదారులకు కూడా ఈ రుసుములు జులై 1వ తేదీ నుంచి వర్తిస్తాయని ప్రకటించింది ఎస్బీఐ.
సవరణల ప్రకారం.. ఒక నెలలో బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎం వద్ద కలిపి నాలుగు ఉచిత నగదు లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు ఉండగా.. ఆ సంఖ్య పెరిగితే.. క్యాష్ విత్‌డ్రాపై ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ బ్రాంచ్/ ఏటీఎం వద్ద పరిమితికి మించి చేసే ఒక్కో విత్‌డ్రాపై రూ.15+జీఎస్టీ వసూలు చేయనున్నారు.. ఈ విత్‌డ్రాలు హోమ్ బ్రాంచ్, నాన్ ఎస్బీఐ ఎటీఎం వద్ద చేసినా ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.. ఇక, చెక్‌బుక్స్ విషయానికి వస్తే.. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో బీఎస్‌బీడీ ఖాతాదారులకు 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా ఇస్తుంది ఎస్బీఐ.. ఆ తర్వాత అందించే చెక్కులకు కొంత మొత్తాన్ని వసూలు చేయాని నిర్ణయించారు.. 10 లీవ్స్‌తో ఉన్న చెక్‌బుక్‌కి రూ.40+జీఎస్టీ, 25 లీవ్స్‌తో ఉన్న చెక్‌బుక్‌కి రూ.75+జీఎస్టీ వసూలు చేయనున్నారు.. ఇక, అత్యవసర చెక్ బుక్.. 10 లీవ్స్ లేదా అందులో కొంత భాగం ఉన్న చెక్‌బుక్‌కి అయితే, రూ.50+జీఎస్టీ వడ్డించనున్నారు.. మరోవైపు.. ఎస్బీఐ, ఎస్బీఐయేతర బ్యాంక్‌ల శాఖల్లో బీఎస్‌బీడీ ఖాతాదారుల ఆర్థికేతర లావాదేవీలపై చార్జీలు వసూలు చేయరు. ఈ ఖాతాదారులకు బ్రాంచ్‌లు, ప్రత్యామ్నాయ మార్గాల్లో చేసే లావాదేవీలు కూడా ఫ్రీగానే పొందవచ్చు.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎస్బీఐ నాన్ హోం బ్రాంచ్‌ల్లో చెక్ లేదా, క్యాష్ విత్ డ్రాయల్ ఫామ్‌తో నగదు ఉపసంహరణ పరిమితిని పెంచింది. చెక్ ద్వారా రూ. లక్ష, ఎస్బీ ఖాతా పాస్‌బుక్‌తో రూ.25 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ క్యాష్ విత్‌డ్రాలను నెలకు రూ.50 వేలకు పరిమితం చేసింది ఎస్బీఐ.. మొత్తం కొత్త సవరణలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.
Also Read
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!