వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం ఉంది.. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో దేశంలో భిన్నత్వం ఉంటుంది.. అందరినీ ఒకే తాటిపై నడిపించే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేశారు.. వర్ణ, కుల వివక్ష రూపుమాపటానికి బీజం వేసిన మహనీయులు అంబేద్కర్ అని గుర్తుచేసుకున్నారు.. ఇక, వైసీపీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం ఉందని.. ఆ ఘనత సీఎం జగన్‌దే అన్నారు.
Read Also: ఓటు వేయకపోతే రూ.350 ఫైన్..! క్లారిటీ ఇచ్చిన ఈసీ
ఇక, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల సమానత్వం కోసం విశేష కృషి చేస్తున్న గొప్ప నేత వైఎస్ జగన్ అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతఇళ్లు ఉండాలనే ఆకాంక్షతో మహిళల పేరు మీద రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే చెందుతుందన్నారు.. పేద వర్గాలకు ఒక ఆస్తి కల్పన జరుగుతోంది.. వైఎస్ హయాంలో 25 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఉండటానికి మినహాయించి ఇంటిపై హక్కులు లేని లక్షలాది మందిని ఆదుకునేందుకు చేస్తున్న యత్నం ప్రారంభమైందన్నారు. అంబేద్కర్ కలలు సాకారం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని.. గతంలో తీసుకున్న ఇళ్లకు అసలు, వడ్డీ కలిపి నామమాత్రపు రుసుముతో 39 లక్షల ఇళ్లను వారిపేరు మీది రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
మరోవైపు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు సీఎం వైయస్.జగన్… కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కె కనకారావు పాల్గొన్నారు.