యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మొదటి మ్యాచ్లో పోటీపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఇక 165 పరుగులకు టార్గెట్ తో వచ్చిన పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసి ఆ తర్వాత తడబడింది. మొదటి వికెట్ కు కేఎల్ రాహుల్. మయాంక్ అగర్వాల్ 91 పరుగులు జోడించిన ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్ జట్టు. దాంతో ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం నమోదు చేసి ఐపీఎల్ 2021 లో ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. అలాగే ఓడిపోయిన పంజాబ్ జట్టు తన ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా కోల్పోయింది.