Moosarambagh Bridge : మూసారాంబాగ్ ప్రాంతంలో పాత బ్రిడ్జిని కూల్చివేయడానికి జీహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, కొత్త హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తికాకముందే పాత బ్రిడ్జిని కూల్చివేయడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. గతంలో వచ్చిన వరదలలో దెబ్బతిన్న ఈ బ్రిడ్జి, ఇంజనీరింగ్ విభాగం ప్రకారం వాహనాల రాకపోకలకు సురక్షితం కాదని తెలుసుకున్నప్పటికీ, స్థానికుల అభ్యర్థనలను పక్కన పెట్టి ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు చెప్పుతున్నదాని ప్రకారం.. అంబర్‌పేట్ నుంచి…
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వాతావరణం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ వాన పడుతోంది. కాగా భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. ఈ రెండు జలాశయాల నుంచి మూసీకి వరద ప్రవాహం పెరిగింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ముసరాంబాగ్ బ్రిడ్జి మూసివేశారు అధికారులు. నిన్న మధ్యాహ్నం నుంచి బ్రిడ్జి మూసివేశారు. ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్…
Moosarambagh: హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండిపోయాయి. అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది.
Hyderabad: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతోంది. ముసారాంబాగ్ వంతెనను తాకుతూ నది ప్రవహిస్తూనే ఉంది.
గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ వరద కారణంగా దీంతో ఆయా ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మూసి నదికి పెద్ద మొత్తంలో వరద వచ్చి చేరుతున్నది. ఈ వరద కారణంగా నగరంలోని…
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో.. హైదరాబాద్ జంట జలాశయాలకు క్రమంగా ఇన్‌ఫ్లో పెరిగిపోతోంది.. దీంతో.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేసి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఓవైపు జంట జలాశయాల నుంచి వచ్చే నీటితో పాటు.. మరోవైపు వర్షం నీరు మూసీలో చేరడంతో.. ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ నది.. ఇప్పటికే మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్తుండగా.. చాదర్‌ఘాట్ దగ్గర ఉన్న చిన్న…