ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది… మెగా అభిమానులకు గూస్ బంప్స్ షురూ

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా నుంచి రామ్‌చరణ్ సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ టీజర్‌లో రామ్‌చరణ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ‘ధర్మస్థలికి ఆపద వస్తే… ఆ అమ్మోరు తల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అంటూ చరణ్ చెప్పే డైలాగ్ మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. టీజర్ ఆఖర్లో చిరు కూడా కనిపించాడు.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానరుపై రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈచిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించాడు.

Related Articles

Latest Articles