తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా వివాదం చెలరేగింది. తాజాగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే సీఎం కేసీఆర్, మంత్రుల బృందం వత్తిడి వల్లే కేంద్రం దిగివచ్చిందా? రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించిందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌కు కేంద్రం దిగొచ్చింది. సీఎం కేసీఆర్ కృషి, మంత్రుల దౌత్యం ఫలించింది.
వానా కాలం పంటకు సంబంధించి రాష్ట్రం నుంచి అదనంగా బియ్యం సేకరించేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్రం నుంచి మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించనుంది. ఈ మేరకు కేంద్రం రాష్ట్రానికి లేఖ ద్వారా వెల్లడించింది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ద్వారా సమాచారం ఇచ్చింది. గతంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం ఒప్పుకుంది. తాజాగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించనుంది. మరి కేంద్రంతో గొడవ జరగకపోయి వుంటే బియ్యం తీసుకునేవాళ్ళు కాదా? ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఏమంటున్నారు?