Vande Bharat: రాజస్థాన్‌లో తొలి వందేభారత్ రైలు.. ఆ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఈ రైలు అజ్మీర్ నుంచి న్యూఢిల్లీ మధ్య నడుస్తుంది. జైపూర్, అల్వార్, గుర్గావ్లలో వందేభారత్ రైలు ఆగుతుంది. జైపూర్-ఢిల్లీ కాంట్ వందే భారత్ ప్రారంభ ప్రత్యేక రైలు సర్వీస్ జైపూర్ నుండి ఉదయం 11.00 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు.
Also Read: Firing At Punjab : పంజాబ్ మిలిటరీ స్టేషన్లో కాల్పులు.. నలుగురు మృతి
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అజ్మీర్ నుండి ఢిల్లీ వరకు 5 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్‌ప్రెస్. ఇది ఢిల్లీ నుండి అజ్మీర్ మధ్య 6 గంటల 15 నిమిషాలలో ప్రయాణిస్తుంది. అందువల్ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆ మార్గంలో నడుస్తున్న ప్రస్తుత వేగవంతమైన రైలు కంటే 60 నిమిషాలు వేగంగా ఉంటుంది.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
అజ్మీర్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హై రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ (OHE) సెక్టార్లో ప్రపంచంలోనే మొదటి సెమీ-హై స్పీడ్ ప్యాసింజర్ రైలు అవుతుంది. ఈ రైలు పుష్కర్, అజ్మీర్ షరీఫ్ దర్గాతో సహా రాజస్థాన్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం( PMO) తెలిపింది. మెరుగైన కనెక్టివిటీ ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధిని కూడా పెంచుతుంది.
Also Read:Mahaboobnagar Crime: ఆసుపత్రికి క్యూ కడుతున్న కల్తీ కల్లు భాదితులు.. ఇద్దరు మృతి
కొద్ది రోజుల క్రితం, ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రవేశపెట్టడం వల్ల తెలంగాణలోని సికింద్రాబాద్ మరియు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరాల మధ్య ప్రయాణ సమయం సుమారు మూడున్నర గంటలు తగ్గుతుంది, ఇది ముఖ్యంగా యాత్రికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!