పంజాబ్‌లో ఓ సైనిక శిబిరంపై కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో ఈరోజు తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. భటిండా మిలిటరీ స్టేషన్‌లో తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో కాల్పుల జరిగాయి. అధికారుల మెస్‌లోనే కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటన ఉగ్రదాడి కాదని పంజాబ్ ఎస్‌ఎస్పీ తెలిపారు. మరణించిన నలుగురూ 80 మీడియం రెజిమెంట్‌కు చెందిన వారుగా గుర్తించారు. కాల్పులకు తెగడబడిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలుచేపట్టామని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) సురిందర్ పాల్ సింగ్ పర్మార్ చెప్పారు.
Also Read:Ukraine : ప్రధాని మోడీకి జెలెన్స్కీ లేఖ.. మానవతావాద సహాయాన్ని కోరిన ఉక్రెయిన్
ఇది ఉగ్రదాడిలా కనిపించడం లేదు. ఇది సోదరుల హత్య కేసుగా కనిపిస్తోంది అని పంజాబ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భటిండాలోని ఆర్మీ కాంట్ యొక్క అన్ని ప్రవేశ ద్వారాలు మూసివేయబడ్డాయి. భటిండా మిలిటరీ స్టేషన్‌లో సైనికులు వారి కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం యూనిట్ యొక్క గార్డు గది నుండి INSAS అసాల్ట్ రైఫిల్ మిస్ అయినట్లు సమాచారం.