చెట్టుపైన గూళ్లు…కాదు ఇవి హోట‌ళ్లే…

ప్ర‌కృతి నుంచి మ‌నిషి ఎన్నో తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ఉంటారు.  ప‌క్ష‌లు చెట్ల‌పై గూళ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి.  ఆ గూళ్ల‌ను ఆధారంగా చేసుకొని ఇప్పుడు మ‌నిషి చెట్ల‌పై గూళ్లు లాంటి హోటళ్లు నిర్మించ‌డం మొద‌లుపెట్టారు. క్యూబాలోని అడ‌వుల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ఎత్తైన చెట్ల‌పై ట్రీ టాప్ హోట‌ళ్ల‌ను నిర్మించారు.  ఈ హోట‌ళ్ల‌లో అధునాత‌న‌మైన లాంజ్‌లు, గదులు ఉన్నాయి.  ఒక ట్రీ టాప్ నుంచి మ‌రోక ట్రీ టాప్ కు వెళ్లేందుకు మ‌ధ్య‌లో చెక్క వంతెన‌లు ఏర్పాటు చేశారు.  వెలిజ్ ఆర్కిటెక్టో అనే వ్య‌క్తి ఈ హోట‌ళ్ల‌కు శ్రీకారం చుట్టారు.  ప్ర‌శాంత‌త‌కు నిల‌య‌మైన ఈ హోట‌ళ్లు ఇప్పుడు ఆక‌ట్టుకుంటున్నాయి.  

Read: భార‌త్‌లో మ‌రో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌…

-Advertisement-చెట్టుపైన గూళ్లు...కాదు ఇవి హోట‌ళ్లే...

Related Articles

Latest Articles