కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాక బీజేపీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కొత్త వారికి బీజేపీ అవకావశం కల్పించింది. కొంత మంది సీనియర్లను పక్కన పెట్టింది. బీజేపీ అగ్రనాయకత్వం టికెట్ కేటాయించనందుకు మాసీ సీఎం జగదీశ్ షెట్టర్ సహా పలువురు నాయకులు బీజేపీని వీడారు. వారిలో కొందరు పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రత్యర్థి పార్టీలలో చేరారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అనేక మంది అనుభవజ్ఞుల పదవీ బాధ్యతలను తొలగించిన బిజెపి ఈసారి చాలా మంది కొత్త ముఖాలకు, యువ నాయకులను రంగంలోకి దించింది. అసంతృప్తితో ఉన్న నేతలపై పార్టీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేతకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప టికెట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయనకు శుక్రవారం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పిలుపు వచ్చింది.
Also Read:Vallabhaneni Vamsi Mohan: వల్లభనేని కౌంటర్ ఎటాక్.. వెంటిలేటర్‌పై ఉంది ఎవరు..?
పార్టీ నిర్ణయాన్ని ఆమోదించినందుకు సెంట్రల్ కర్ణాటకలోని శివమొగ్గ నుండి ఐదుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన ఈశ్వరప్పకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈశ్వరప్ప విధేయత, నిబద్ధతను ప్రశంసించారు. పార్టీ పట్ల ఆయన చూపించిన నిబద్ధతపై సంతోషం వ్యక్తం చేశారు. తదుపరి కర్ణాటక పర్యటనకు వచ్చినప్పుడల్లా కలుస్తానని ఈశ్వరప్పతో ప్రధాని మోదీ అన్నారు. తన నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చన్నబసప్ప తరుపున ప్రచారం చేస్తానని ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. కర్నాటకలో బీజేపీ విజయం సాధించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని మాజీ మంత్రి ఈశ్వరప్ప ప్రధానికి మాటిచ్చారు.
Also Read:Mla Sanjay Kumar : అప్పుడప్పుడు వైద్యం వికటించడం కామన్
కాగా, ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో సీనియర్ అయిన ఈశ్వరప్పకు బీజేపీ టికెట్ కేటాయించలేదు. ఆరోసారి పోటీ చేయాలనే ఈశ్వరప్ప భావించారు. అయితే, పార్టీ నిర్ణయంతో కొంత నిరాశ చెందారు. ప్రధాని మోడీ తనకు ఫోన్ చేస్తారని కలలో కూడా ఊహించలేదని ఈశ్వరప్ప అన్నారు.ఆయన స్ఫూర్తిదాయకమన్నారు. బీజేపీపై తనకు కోపం లేదని, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని ఈశ్వరప్ప చెప్పారు. కాగా, కర్ణాటక ఎన్నికలు మే 10న జరగనున్నాయి. మే 13న ఫలితాల వెల్లడిస్తారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ప్రజాదరణకు పరీక్షగా భావిస్తున్నారు.