పెట్రోల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్… పెట్రోల్‌పై ఇప్పటి వరకు ఉన్న వ్యాట్‌ను 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది.. దీంతో.. పెట్రోల్ ధరలు భారీగా తగ్గనున్నాయి… ఢిల్లీ సర్కార్ తాజా నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8 వరకు తగ్గనుంది. కొత్త రేట్లు ఈ రోజు అర్ధరాత్రి నుండి అమల్లోకి వస్తాయని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: ఆర్టీసీ చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్.. ఎంతంటే..?
ఇక, వరుసగా పెరిగిపోయిన పెట్రో ధరలు ఆల్‌టైం హై రికార్డు సృష్టించగా.. దీపావళికి ముందు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది కేంద్రం.. మరోవైపు.. బీజేపీ పాలిత, ఎన్డీయే పాలి రాష్ట్రాలు కూడా పెట్రో వ్యాట్‌ను తగ్గించగా.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో కూడా తగ్గించాల్సిందేనంటూ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నేతలు ఆందోళనలు కూడా చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా.. పెట్రోల్ ధర లీటర్‌పై ఏకంగా రూ.8 తగ్గేలా నిర్ణయం తీసుకున్నారు.